గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు.. కంబోడియా

Written By సెల్వి
Updated: బుధవారం, 28 జులై 2021 (10:00 IST)
కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొనడం కలకలం రేపుతోంది. భారతదేశంలో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో దిగుమతులను కంబోడియా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. 
 
ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మరలా దిగుమతులకు ఒకే చెప్పింది. భారతదేశంలో ఉన్న వస్తువులు, ఇతరత్రా ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో… భారత్ నుంచి గేదె మాంసం కంటైనర్లలో కంబోడియాకు ఎగుమతి అయ్యాయి. 
 
కానీ…ఈ మాంసంలో కరోనా మూలాలు ఉన్నట్లు నిర్ధారించడంతో మూడు కంటైనర్లను నిలిపివేసింది. ఓ ప్రైవేటు సంస్థ రవాణా చేసిన అయిదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు, ఇందులోని మాంస పదార్థాలను వారం తర్వాత నాశనం చేస్తామని వెల్లడించారు. 
 
కంబోడియాలో కూడా కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మంగళవారం కొత్తగా 685 కరోనా కేసులు నిర్ధారించారు. 19 మంది చనిపోయారు. 74 వేల 386 కేసులున్నాయి. మొత్తం వేయి 324 మంది చనిపోయారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments