శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (11:54 IST)

అమెరికాలో అపసవ్య దిశలో కరోనా పోరు : హెచ్చరించిన డాక్టర్ ఫౌచీ

అమెరికా కరోనా వైరస్‌పై పోరు అపసవ్య దిశలో సాగుతోందని ఆ దేశ ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించడం పట్ల అమెరికా అధికారులను ఆయన హెచ్చరించారు. 
 
కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అమెరికా ప్రస్తుతం 'తప్పు మార్గం'లో వెళుతోందని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మందగించడంతోపాటు డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించడం పట్ల అమెరికా అధికారులను డాక్టర్ ఫౌచీ మరోసారి హెచ్చరించారు. 
 
'దేశంలో ఇంకా సగం మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదు. ఇది అమెరికాకు పెద్ద సమస్య. రానున్న రోజుల్లో కొవిడ్ మరణాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం తప్పు మార్గంలో వెళుతున్నామని తెలుస్తోంది' అని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.