రజనీకాంత్ మక్కల్ పార్టీ గురించి తాజా చర్చలు-మళ్ళీ రాజకీయాలకు నో
సూపర్ స్టార్ రజనీకాంత్ మరలా తాను రాజకీయాల్లోకి రావాలా వద్దా? అనే సందిగ్థంలోనే ఇంకా వున్నారు. గత తమిళనాడు ఎన్నికలముందు పార్టీ పెట్టి మక్కల్ మండ్రం పార్టీ తరఫున నిలబడుతున్నట్లు తన సన్నిహితులు, అభిమానులతో ప్రకటించారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోనే అన్నాత్తై షూటింగ్‌లో వుండగా జూబ్లీహిల్స్‌లోని అపోలోలో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వద్దనీ, ఆరోగ్యం చూసుకోమని చెప్పినట్లు, ఆ వెంటనే తన రాజకీయ ప్రకటన విరమించుకున్నారు. ఆ తర్వాత కరోనా వల్ల షూటింగ్ లు వాయిదా పడ్డాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత రజనీ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్ళి ఇటీవలే తిరిగి ఆరోగ్యంగా వచ్చారు.
ఇక ఆయన వచ్చినపప్పటినుంచీ అభిమానులు, పార్టీ కార్యకర్తలతో భేటీ అవ్వాల్సివచ్చింది. వారు తీవ్రంగా ఒత్తిచేయడంతో సోమవారంనాడు చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో సమావేశం అయ్యారు. ఆ సమయాంలో తన ఆనారోగ్యం గురించి ఇతర విషయాల గురించి మాట్లాడినట్లు సమాచారం. దాంతో ఆయన మీడియాముందుకు వచ్చి రాజకీయాలకు రానని తేల్చిచెప్పారు.తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని మరోసారి స్పష్టం చేశారు. రజినీ మక్కల్ మండ్రంను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయంలో పలువురు పలురకాలుగా స్పందించారు. తెలుగు సినిమా పరిశ్రమ ఆయన నిర్ణయంపై అది రజనీ వ్యక్తిగతమని కొందరంటే ఇది శివాజీ సినిమాలోలా వుందని అంటున్నారు. ఈ విషయంలో తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, రజనీ నిర్ణయం శివాజీ సిమిమాలో డైలాగ్‌గా వుందనీ, ఆయన పార్టీ పెట్టినా పెట్టకపోయిన ఇప్పుడు ఒరిగేది ఏమీలేదనీ అంటున్నారు. ఆయన గతంలో ఎన్నికల్లో పాల్గొనని అనడంతో కేంద్రప్రభుత్వం ఆయనకు అవార్డుకూడా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. సో. బి.జెపి.కి సపోర్టా, లేదా అనేది ఆయన ముందు క్లారిటీ ఇవ్వాలని సినీవర్గాలు చెబుతున్నాయి.