Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు

Written By సెల్వి
Updated: సోమవారం, 31 మే 2021 (17:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. ఇటీవల వరకు ఉద్ధృతస్థాయిలో వ్యాపించిన కరోనా వైరస్ ఇపుడు కాస్త నెమ్మదించింది. ఫలితంగా రెండు నెలల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య పదివేలకు లోపు నమోదయ్యాయి. 
 
గత 24 గంటల్లో 83,461 కరోనా పరీక్షలు నిర్వహించగా కేవలం 7,943 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి (1,877), చిత్తూరు (1,283) జిల్లాలను మినహాయిస్తే, మిగతా అన్ని జిల్లాల్లో వెయ్యికి లోపే కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 231 కేసులు గుర్తించారు.
 
మరోవైపు, 19,845 మంది కరోనా నుంచి కోలుకోగా, 98 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 మంది, ప్రకాశం జిల్లాలో 10 మంది మృతి చెందారు. 
 
దాంతో మొత్తం మరణాల సంఖ్య 10,930కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,93,085 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకినవారిలో 15,28,360 మంది కోలుకోగా, ఇంకా 1,53,795 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఔషధం పంపిణీకి ఏపీ హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఔషధం పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ జరుగగా, హైకోర్టు ఇరు వర్గాల వాదనలు ఆలకించి అనుమతి ఇచ్చింది. 
 
ఆనందయ్య మందును పంపిణీ చేయవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కంట్లో వేసే చుక్కల మందుపై గురువారంలోగా పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

అన్నీ చూడండి

Mega158: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న భారీ అప్‌డేట్

NTR: ఇటు ఎన్.టి.ఆర్.కు ఫిజియో థెరపీ - అటు డ్రాగన్ డేట్ గురించి అప్ డేట్

Snadeep: తుది దశకు చేరుకున్న సిగ్మా పోస్ట్ ప్రొడక్షన్, గాంధీ జయంతికి డేట్ ఫిక్స్

రవితేజ చెప్పిన ముదురు ముం* మాటలో తప్పులేదంటున్న: శివ నిర్వాణ

టైమ్స్ స్క్వేర్‌లో బుట్టబొమ్మ చేతిలో జాతీయ పతాకం...ఉల్లాసంగా(video)

తర్వాతి కథనం
Show comments