భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు జడుసుకుంటున్నారు. తాజాగా దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,922 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిందని, అలాగే మరో 418 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,73,105కు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనాతో 14,894 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 1,86,514 మంది చికిత్స పొందుతుండగా కరోనాతో కోలుకొని 2,71,696 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు పదివేలు దాటాయి. జూన్ 1 నుంచి రెండు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో టెస్ట్‌లు పెంచిన దగ్గర నుంచి ప్రతిరోజూ 500కి తగ్గడం లేదు. బుధవారం రోజు 891 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఇందులో గ్రేటర్ పాజిటివ్ కేసులు 719. కరోనాతో ఐదుగురు మృతిచెందారు. రంగారెడ్డిలో 86, మేడ్చల్ 55 కేసులు నమోదు అయ్యాయి.
గత 24 గంటల్లో 4,069 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3178 నెగటివ్. 891 పాజిటివ్ గా తేలాయి. దీంతో తెలంగాణ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటింది. 10,444కి చేరింది. బుధవారం ఒక్కరోజే 137 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకూ 4,361 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 5,858.
అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. తాజాగా 891 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇటు ఏపీలో కూడా కరోనా కేసులు పదివేలు దాటాయి. గత 24 గంటల్లో 497 కేసులు బయటపడ్డాయి. గత 15 రోజుల్లో 5 వేల కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసులు సంఖ్య10,331. ఇప్పటి వరకూ 4,779 రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 5,423.
కర్నూలు, కృష్ణాలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. అయితే ఏపీలో పట్టణాలు దాటి జిల్లాలు, గ్రామాలకు విస్తరించడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు తిరిగి వచ్చిన వారితోనే కరోనా సోకుతుందనే అనుమానాలు ఉన్నాయి.