శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (18:36 IST)

వేధించిన యువకుడిని పబ్లిక్‌గా చితక్కొట్టాను.. రెజీనా (Video)

దేశ వ్యాప్తంగా మీటూ, క్యాస్టింగ్ కౌచ్‌పై పెద్ద ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ రెజీనా చేరింది.
 
దక్షిణాది హీరోయిన్ రెజీనా కాసాండ్రా 'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' లాంటీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 
 
తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ రెజీనా నటిస్తోంది. ఈ నేపథ్యంలో మిస్టర్ చంద్రమౌళి ప్రమోషన్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. చాలా సార్లు వేధింపులకు గురయ్యాను అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. 
 
తనను లొంగదీసుకునేందుకు పలువురు ప్రయత్నించారని చెప్పుకొచ్చింది. ఎన్నోసార్లు వేధింపులు ఎదురయ్యాయని చెప్పింది. అలాగే తనని వేధించాలని చూసిన ఒక యువకుడిని పబ్లిక్ ముందే చితక్కొట్టానని కూడా తెలిపింది. ప్రస్తుతం రెజీనా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.