నా అభిమానులు ఆ ప్రశ్నలతో నన్ను బాధపెట్టారు - రెజీనా

regina
జె| Last Modified బుధవారం, 14 ఆగస్టు 2019 (17:05 IST)
హీరోయిన్ రెజీనా మొదట్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ కొన్ని సినిమాలు హిట్టయితే..ఎక్కువ సినిమాలు ఫట్ అయ్యాయి. దీంతో రెజీనాకు అవకాశాలు తగ్గాయి. అభిమానులు నిరుత్సాహపడిపోయారు.

ఎప్పుడూ ట్విట్టర్లో చాలా చురుగ్గా అభిమానులకు సమాధానం చెప్పే రెజీనా.. చివరకు సినిమాలు వరుస ఫ్లాప్‌లు కావడంతో వెనక్కి తగ్గింది. ట్విట్టర్ అకౌంట్‌ను ఓపెన్ చేయడం మానేసింది. దీంతో అభిమానులు రెజీనాపై కోపం పెంచుకున్నారు.

రెజీనా తాజాగా నటించిన సినిమా ఎవరు. ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది. ఒక వెరైటీ గెటప్‌లో రెజీనా కనిపించబోతోంది. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు తను ఆ సినిమాలో నటించినట్లు చెప్పింది. ఎవరు సినిమా పెద్ద హిట్ అవుతుందని సంతోషంగా చెప్పింది రెజీనా. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
Regina

అయితే అభిమానులు రెజీనాపై ప్రశ్నల వర్షం కురిపించారు. సినిమా సినిమాకు ఎందుకింత గ్యాప్. వరుసగా నటించు. నిన్ను మించిన హీరోయిన్ లేరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తాను అభిమానుల ప్రశ్నలకు చాలా బాధపడ్డానని చెబుతూ మళ్ళీ ట్వీట్ చేసింది. దయచేసి అలాంటి పోస్టింగ్‌లు పంపొద్దండి.. కథ నాకు నచ్చి ప్రయారిటీ ఉన్న పాత్ర అయితే నేను చేయగలను. నాకు ఆ సత్తా ఉంది.. మరోసారి అభిమానులు ఇలాంటి మెసేజ్‌లు పెట్టొద్దంటూ కోరిందట రెజీనా.దీనిపై మరింత చదవండి :