'ఎవరు' మరో క్షణం అవుతుందా..? అడివి శేష్‌కి విజయాన్ని అందిస్తుందా..?
అడివి శేష్, నవీన్ చంద్ర, రెజీనా ప్రధాన తారాగణంగా రూపొందిన థ్రిల్లర్ ఎవరు. ఈ చిత్రానికి వెంకట్ రామ్ జీ దర్శకత్వం వహించారు. పీవీపీ సినిమాస్ బ్యానర్ పైన రూపొందిన ఈ మూవీని ఈ నెల 15న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎవరు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే... రెజీనాను రేప్ చేయబోయిన నవీన్ చంద్రను ఆమె కాల్చి చంపడంతో సినిమా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అయితే.. నిజంగానే అత్యాచారయత్నం జరిగిందా? లేక దీని వెనుక మరో కుట్ర ఉందా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును పోలీస్ అధికారి విక్రమ్ వసుదేవ్(అడవి శేష్)కు అప్పగిస్తారు.
ఈ కేసును విక్రమ్ ఎలా సాల్వ్ చేశాడన్న సస్పెన్స్‌తో సినిమా కొనసాగుతుంది అనేది ట్రైలర్‌ను బట్టి తెలుస్తుంది. అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర.. ఈ ముగ్గురి మధ్య నడిచే ఈ కథ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. క్షణం సినిమా వలే పెద్ద విజయం సాధిస్తుందనే అంచనాలను ఏర్పరిచింది. మరి... ఎవరు ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.