గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: గురువారం, 27 జనవరి 2022 (20:34 IST)

ఒమిక్రాన్ వచ్చిందా? ఏమో? కనిపెట్టడం ఎలా?

ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు సాధారణ ఫ్లూ మాదిరిగానే ఎక్కువ లేదా తక్కువ ఉంటాయి. అయితే, ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం కష్టతరం చేసే చిన్న తేడాలు ఉన్నాయి.


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్, సాధారణ ఫ్లూ రెండూ దగ్గు- ముక్కు కారడం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి లక్షణాలను చూపించే వ్యక్తి రెండు వైరల్ ఇన్ఫెక్షన్ల మధ్య ఎలా తేడాను గుర్తించగలడు? వాస్తవానికి, ఒక మార్గం ఏమిటంటే, తనను తాను పరీక్షించుకోవడం, దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవడం.

 
వైద్యులు చెపుతున్న దాని ప్రకారం... కోవిడ్‌ లోని ప్రధాన లక్షణాలు ఏమిటంటే, జ్వరం సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులు ఉంటుంది. ఆ తర్వాత జ్వరం తగ్గిపోతుంది. బలమైన వళ్లు నొప్పులు, వెన్నునొప్పి ఉంటుంది. ఇది ఫ్లూ కంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఫ్లూ పేషెంట్లలో వెన్నునొప్పి, విపరీతమైన తలనొప్పులు, వళ్లు నొప్పులు మనకు కనిపించవు. ఇది కోవిడ్‌లో మొదటి ఒకటి నుండి మూడు రోజుల్లో చాలా తీవ్రంగా ఉండవచ్చు.

 
కొత్త వేరియంట్ గురించి ప్రజలు సాధారణంగా కనిపిస్తున్నారు. ఇది జలుబు తప్ప మరేమీ కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నట్లుగా చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ మాస్కులు సరిగ్గా ధరించకుండానే తిరుగుతున్నారు. ఇది ప్రమాదకర పరిస్థితి. ఎందుకంటే కోవిడ్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో పట్టింపలేని ధోరణితో వుంటే వైరస్ మరింత దూకుడు పెంచే ప్రమాదం లేకపోలేదు.