మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (19:53 IST)

కరోనా మహమ్మారి చివరి దశలో వుందంటే అంతకుమించిన మూర్ఖుడు మరొకడు వుండడు

కరోనా మహమ్మారి చివరి దశలో వుందంటే అంతకుమించిన మూర్ఖుడు మరొకడు లేడు. కరోనా వైరస్ ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. ఇప్పటికే అనేక రకాలుగా ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ మహమ్మారి మరిన్ని కొత్త రూపాలతో విజృంభించే అవకాశం ఉందని, ఈ దశలో ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

 
కరోనావైరస్ విషయంలో ఒమిక్రాన్ చివరి వేరియంట్ అనీ, ఇది వైరస్ యొక్క ముగింపు అని భావించడం ప్రమాదకరం అని చెప్పింది. మన దేశంలో కొన్ని రోజుల నుంచి రోజుకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ అయితే వైరస్‌కు కారణమైన ఒమిక్రాన్ ఇప్పుడు దేశంలో విస్తరణ ప్రక్రియలో ఉందని ఇండియన్ సోర్స్-కోవ్ 2 జెనోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియం హెచ్చరించింది. కరోనా ప్రమాద స్థాయి అలాగే ఉందని చెప్పారు. అయితే ఫిబ్రవరి మూడో వారం నాటికి థర్డ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతుందని చెపుతున్నారు. మరో 15 రోజుల్లో థర్డ్ వేవ్ తారాస్థాయికి చేరుకుంటుంది, అందుకే ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి.

 
ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది, ఇది గత రెండు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది బిలియన్ల మందికి చేరుకుంది. దాదాపు 170 దేశాల్లో తన సత్తా చాటుతోంది. ఒమిక్రాన్ పూర్తిగా మాయమైతే కరోనా చనిపోయిందని చాలామంది అపోహపడుతున్నారు. అంతటితో ఆగకుండా.. ఆ భావనతోనే కరోనా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా పనైపోయిందన్న భరోసాతో జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. మూడో వేవ్ కేసుల సంఖ్య తగ్గింది కానీ దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం.

 
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో చాలా కంపెనీల్లో సిబ్బంది సహజంగానే తగ్గారు. కరోనా సోకిన వారు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఈ ప్రభావం వైద్యరంగంపై కూడా పడుతోంది. దీంతో వైద్య సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఇలాంటి పరిస్థితులను ఒమిక్రాన్ సద్వినియోగం చేసుకుంటోంది. అయితే, అన్ని కేసులు ఒమిక్రాన్ అని చెప్పలేము. ఎందుకంటే పది నుంచి 20 శాతం డెల్టా వేరియంట్ కేసులు కూడా ఉన్నాయి. అందుకే ఒమిక్రాన్ విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.