బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 17 జనవరి 2022 (21:52 IST)

రెండంటే రెండు రోజులు మాస్క్ లేకుండా తిరిగా, ఏమైందో తెలుసా?: యూఎస్ టాప్ డాక్టర్ అనుభవం

రెండంటే రెండు రోజులు మాస్క్ లేకుండా తిరిగా, ఏమైందో తెలుసా? అంటూ యూఎస్ టాప్ డాక్టర్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు ట్విట్టర్ పేజీలో. మాస్క్‌ల ప్రాముఖ్యతను తన మొదటి పాఠంగా, ముఖ్యంగా N95 లేదా KN95గా మాస్కు ప్రాధాన్యతను వివరించారు.

 
అమెరికాలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ యూనస్ ట్విట్టర్లో తన అనుభవాలను చెపుతూ.. గత రెండేళ్లలో వేలాది మంది కరోనా రోగులు ఉన్నప్పటికీ, తనకు ఎప్పుడూ కరోనావైరస్ సోకలేదని అన్నారు. ఈమధ్య రెండు రోజులు మాస్కు వేసుకోకుండా కుటుంబ ఫంక్షనుకి హాజరయ్యాను. అంతే నా వెంటపడి కోవిడ్ -19 వచ్చింది. దీన్నిబట్టి నేను గమనించింది ఇక్కడ చెప్తున్నాను.

 
నేను నేర్చుకున్న పాఠం 1 ఏంటంటే... మాస్క్‌లు చాలా చక్కగా పని చేస్తాయి. ఎందుకంటే నేను గత రెండేళ్లలో 1000 సార్లు కోవిడ్ పేషెంట్ల చుట్టూ తిరిగాను. మాస్క్‌లు, పిపిఇలు కారణంగా వ్యాధి బారిన పడలేదు. కానీ మాస్క్‌లు లేకుండా కుటుంబ ఫంక్షనుకు హాజరయ్యాను, అంతే నన్ను కోవిడ్ పట్టుకుంది. దాంతో నాకు అర్థమైంది ఏంటంటే... మాస్క్ లేకుండా ఇక బయట తిరగకూడదని.

 
కోవిడ్-19 వ్యాక్సిన్‌ల ప్రభావం ప్రాణాలను నిలబెడుతుందని తెలుసుకున్నాను. ఎందుకంటే నాకు ఒమిక్రాన్ సోకి 5 రోజులు అయ్యింది. ఐనా నేను మాట్లాడుగలుగుతున్నానంటే నేను వేసుకున్న కోవిడ్ టీకానే కారణం. ఆ టీకా వల్ల నేను ఈరోజు బతికి బయటపడ్డాను. వ్యాక్సిన్+బూస్టర్ బాగా పనిచేసింది. నేను టీకాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

 
తనకు జరిగిన చికిత్స గురించి వైద్యులు మాట్లాడుతూ, రోగ లక్షణాలు స్వల్పంగా ఉన్నందున స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ లేదా పాక్స్‌లోవిడ్, ఐవర్‌మెక్టిన్, జింక్ మొదలైనవాటిని తీసుకోలేదు. నా అనుభవం ప్రకారం, ఎక్కడికెళ్లినా మాస్క్ వేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే ఇంకా టీకా తీసుకోని వారు ఎవరైనా వుంటే తక్షణమే తీసుకోండి అనేది నా స్వీయ అనుభవం. ప్లీజ్ ఇవి రెండూ పాటించండి అంటున్నారు ఆ ప్రముఖ వైద్యుడు.