మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (16:42 IST)

డాక్టర్ శింబు - చిన్నవయసులోనే డాక్టరేట్ అందుకున్న హీరో

కోలీవుడ్ హీరో సిలంబరసన్ అలియాస్ శింబు డాక్టర్ అయ్యారు. చిన్నవయస్సులోనే ఆయన గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న హీరోగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ఖాతాలో వెల్లడించారు. 
 
"నాకు ఈ గౌవరాన్ని అందించిన వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు. ఈ గౌరవాన్ని నేను నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను. నాకు ఈ సినిమాను పరిచయం చేసి, ఇక్కడ వరకు తీసుకొచ్చింది వారే. వారే లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అందుకే ఈ గౌరవాన్ని వారికే అంకితమిస్తున్నాను. నన్ను ఎంతగానో అభినందించే అభిమానులకు థ్యాంక్స్" అని చెప్పారు. 
 
ఇక ఈ వేడుకలో శింబు తల్లిదండ్రులైన హీరో టి. రాజేందర్, ఆయన భార్య ఉషా రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుంత ఈ ఫోటోలు ఇపుడు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా, శింబు ఇటీవల 'మానాడు'తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెల్సిందే.