ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం : 11 మంది హౌస్ సర్జన్లకు పాజిటివ్
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా దావఖానాలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఈ ఆస్పత్రిలో పని చేసే వైద్యుల్లో 11 మంది హౌస్ సర్జన్లకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. కోవిడ్ థర్డ్ వేవ్‌లో అనేక మంది వైద్యులు, వైద్య సిబ్బంది వైరస్ సోకుతున్న విషయం తెల్సిందే.
ఈ క్రమంలో ఈ ఆస్పత్రిలోని వైద్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 11 మంది హౌస్ సర్జన్లకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ప్రభుత్వ దావఖానాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దీంతో రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా, కరోనా వైరస్‌తో పాటు.. ఒమిక్రాన్ వైరస్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.