సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

కూకట్‌పల్లిలో బైకును ఢీకొన్న టిప్పర్ - టెక్కీ దుర్మరణం

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యారు. మృతుడుని జగన్మోహన్ రెడ్డిగా గుర్తించారు. బైకును ఢీకొట్టిన తర్వాత టిప్పర్ లారీ ఆగకుండా వేగంగా దూసుకెళ్లిపోయింది. దీంతో మృతదేహాన్ని టిప్పర్ లారీ 20 మీటర్ల వరకు ఈడ్చెకెళ్లింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం దావఖానాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.