గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (17:03 IST)

బంగారం కొనాలనుకుంటున్నారా? ఐతే ఇదిగోండి గుడ్ న్యూస్

బంగారం కొనాలనుకుంటున్నారా? పసిడి ప్రియులకు శుభవార్త. గత రెండు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు కూడా పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.350 దిగొచ్చింది.
 
దీంతో బంగారం ధర రూ. 44,600కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 390 తగ్గుదలతో రూ. 48,650కు చేరింది. ఇక, వెండి ధర రూ. 900 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 64,500కు చేరింది.
 
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,600 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650కు ఉంది. కేజీ వెండి ధర రూ. 64,500వద్ద కొనసాగుతోంది.