చెన్నైలో కరోనా వీధులు: ప్రతి నాలుగు వీధుల్లో ఒకరికి కరోనావైరస్
చెన్నైలో కరోనావైరస్ దూకుడు విపరీతంగా వుంది. గత కొన్ని రోజులుగా చెన్నైలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, 10,000 కంటే ఎక్కువ వీధుల్లో ఇప్పటికీ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రతి నాలుగు వీధుల్లో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంది.
చెన్నై కార్పొరేషన్ డేటా ప్రకారం, గురువారం ఉదయం నాటికి 10,008 వీధుల్లో కనీసం ఒక కోవిడ్ కేసు ఉంది. నగరంలో మొత్తం 39,537 వీధులు ఉన్నాయి. మొత్తం సోకిన వీధుల్లో 6,638 వీధుల్లో మూడు కంటే తక్కువ క్రియాశీల కేసులు ఉన్నాయి. అయితే 1,735 వీధుల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నాయి.
తేనాంపేట్‌లో 1267 కేసులు, అడయార్‌లో 1,155 యాక్టివ్ కేసులతో ఉన్నాయి. గురువారం ఉదయం నగరంలో 61,575 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుండగా, రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతోంది. కొద్ది రోజుల క్రితం, నగరంలో దాదాపు 9,000 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం, కొత్త కేసులు 7,500 తగ్గాయి. కేసులు తిరిగోమనంతో జనవరి ఆఖరికి కరోనా తగ్గిపోతుందేమోనని అనుకుంటున్నారు.