Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దేశంలో కొత్తగా 9,355 కరోనా కేసులు

Written By వరుణ్
Updated: గురువారం, 27 ఏప్రియల్ 2023 (10:44 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గినట్టు కనిపించిన కరోనా కేసులు గురువారం మళ్లీ పది వేలకు చేరుకున్నాయి. బుధవారం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 24 మరణాలు సంభవించగా, ఇందులో ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఆరుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 57410 క్రియాశీలక కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
దేశంలో కరోనా వ్యాప్తిని సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 5.36 శాతమని తెలిపింది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.13 శాతమన్న కేంద్రం, కొవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా ఉందని వెల్లడించింది. ఇక దేశంలో ఇప్పటివరకూ 22.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. 

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments