గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2022 (10:52 IST)

దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసులు

Covid Vaccine
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మొన్నటికిమొన్న 20 వేలకుపైగా నమోదైన ఈ పాజిటివ్ కేసుల గడిచిన 24 గంటల్లో 19 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఆదివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. గడిచిన 24 గంటల్లో 18738గా నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,40,78,506కు చేరింది. 
 
వీరిలో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మంది చనిపోగా, ప్రస్తుతం దేశంలో 1,34,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గత 24 గంటల్లో 40 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా, 18558 మంది ఈ వైరస్ నుంచి విముక్తులైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రకటనలో తెలిపింది.