శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (08:22 IST)

కరోనా వైరస్ సోకిన వారిలో కొత్త లక్షణాలు... నాలుకపై గాయాలు కూడా...

కరోనా వైరస్ సోకిన వారిలో కొత్త లక్షణాలను వైద్యులు తాజాగా గుర్తించారు. నాలుకపై గాయాలు, నాలుకపై దురద, నోరు ఎండిపోయినట్టు ఉండడం కూడా కరోనా లక్షణాలు కావొచ్చని అంటున్నారు. 
 
సాధారణంగా కరోనా వైరస్ సోకితే జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, వాసన గుర్తించలేకపోవడం, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలేనని ఇప్పటివరకు భావిస్తున్నారు. 
 
కానీ, కరోనా వైరస్ ప్రభావం నాలుకపైనా పడుతోందని వైద్య నిపుణులు గుర్తించారు. నాలుకపై గాయాలు, నాలుకపై దురద, నోరు ఎండిపోయినట్టు ఉండడం కూడా కరోనా లక్షణాలు కావొచ్చని అంటున్నారు. 
 
ఈ తరహా లక్షణాలతో బాధపడుతున్న వారిలో విపరీతమైన నీరసం ఉంటుందని తెలిపారు. ఈ లక్షణాలతో బాధపడుతున్న వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
నాలుకకు సంబంధించిన లక్షణాలతో కరోనా పరీక్షలు చేయించుకున్న వారిలో అత్యధిక శాతం కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఈ లక్షణాలు కరోనా కొత్త వేరియంట్ల కారణంగానే ఏర్పడుతుండొచ్చని వారు అభిప్రాయపడ్డారు. 
 
జన్యు ఉత్పరివర్తనాలకు లోనైన కరోనా వైరస్ ఈ కొత్త లక్షణాలు కలిగించే అవకాశం ఉందని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. దీంతో కరోనా వైరస్ బాధితులు మరింతగా ఆందోళన చెందుతున్నారు.