ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 15 మే 2021 (21:16 IST)

కరోనా కాటుకు మున్సిపల్ ఉద్యోగి మృతి

కరోనా కాటుకు మున్సిపల్ ఉద్యోగి మృతి చెందారు. భవానీపురంలోని మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న పి ఆనంద్ మరియదాసు (47) ఫిల్టరు బెడ్స్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు.

గత నాలుగురోజుల క్రితం కరోనా బారిన పడిన ఆనంద్ చికిత్స నిమిత్తం ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ లో చేరారు. ఆస్పత్రిలో చేరిన ఆనంద్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.  ఆయన మరణంతో కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.