సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (19:33 IST)

తొమ్మిది నెలల పసికందును బలి తీసుకున్న కరోనా

కరోనా మహమ్మారి తొమ్మిది నెలల పసికందును బలి తీసుకుంది. ఈ విషాధ ఘటన ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఏరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఏరియాలో చోటుచేసుకుంది. శ‌శాంక్ శేఖ‌ర్‌(26), ఆయ‌న భార్య ఇద్ద‌రూ అంధులే. 
 
అయితే వీరికి తొమ్మిది నెల‌ల ప‌సి బాలుడు ఉన్నాడు. 18 రోజుల క్రితం త‌ల్లికి క‌రోనా సోక‌గా, ఆ వైర‌స్ బిడ్డ‌కు కూడా వ్యాపించింది. దీంతో ఇద్ద‌రిని గురు తేగ్ బ‌హ‌దూర్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆ ప‌సిపాప చికిత్స పొందుతూ గురువారం ఉద‌యం క‌న్నుమూశాడు. 
 
తండ్రి శేఖ‌ర్ కూడా క‌రోనా బారిన ప‌డ‌గా, రాజీవ్ గాంధీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప్ర‌తిలో చికిత్స పొందుతున్నారు. కొడుకు మ‌ర‌ణించాడ‌న్న వార్త శేఖ‌ర్‌కు తెలియ‌దు. ఇద్ద‌రు త‌ల్లిదండ్రులు క‌రోనాతో పోరాడుతున్నారు. ప‌సిపాప అంత్య‌క్రియ‌ల‌ను బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేంద‌ర్ సింగ్ నిర్వ‌హించారు.