మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (18:19 IST)

సినీ నటి, ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్‌

Navneet Kaur Rana
సినీ నటి, ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నవనీత్ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవనీత్ నివాసంలోని 11 మంది కరోనా బారిన పడ్డారు.
 
తొలుత నవనీత్ మామ గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. నవనీత్‌కు, ఆమె భర్తకు కరోనా టెస్టులు నిర్వహించారు. దాదాపు 60 మంది సభ్యులు, కార్యకర్తలకు కరోనా పరీక్షలు చేశారు. 
 
అయితే.. నవనీత్ రానా, ఆమె భర్త రవిరానా శాంపిల్స్ వైద్యులు తప్పుగా తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై.. వైద్యఆరోగ్య శాఖకు రవి రానా ఫిర్యాదు చేశారు. దీంతో.. మళ్లీ వీరిద్దరి శాంపిల్స్‌ తీసుకున్నారు. నవనీత్ రిపోర్ట్‌లో రిజల్ట్ పాజిటివ్‌గా తేలింది. దీంతో నవనీత్ కౌర్ ఇంటి ప్రాంగణాన్ని వైద్య ఆరోగ్య శాఖ శుభ్రం చేయించింది.