సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 5 ఆగస్టు 2020 (23:07 IST)

ఏపీలో కరోనా విజృంభణ, 10,128 పాజిటివ్ కేసులు, 77 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభణ సాగుతోంది. గత 24 గంటల్లో 10,128 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అనంతపురం, తూర్పుగోదావరి జిల్లా, కర్నూలు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
 
గత 24 గంటల్లో 60,576 శాంపిల్స్ పరీక్షించగా అందులో 10,128 మందికి కరోనాపాజిటివ్ వున్నట్లు తేలింది. కోవిడ్ కారణంగా గుంటూరులో 16 మంది, విశాఖలో 12 మంది, శ్రీకాకుళంలో 10 మంది, చిత్తూరులో 8, తూ.గోలో 7, కృష్ణాలో 5, నెల్లూరులో 4, కర్నూలులో 3, విజయనగరంలో 3, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు మరణించారు.
 
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,83,566 పాజిటివ్ కేసులకు గాను 1,01,459 మంది డిశ్చార్జ్ కాగా 1,681 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 80,426