కోవిడ్ టెస్టుకు కొత్త రూల్స్.. ఆర్‌టీపీసీఆర్ టెస్టులు ఎప్పుడు చేయాలంటే..?

బుధవారం, 5 మే 2021 (12:46 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ కోసం చేపట్టే ఆర్‌‌టీ పీసీఆర్ టెస్టులకు డిమాండ్ బాగా ఎక్కువైంది. ర్యాపిడ్ టెస్టు చేయించుకున్న వాళ్లు కూడా ఆర్‌టీ‌పీసీఆర్ చేయించుకుంటున్నారు. దీంతో ల్యాబొరేటరీలపై పని ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఆర్‌టీ‌పీసీఆర్ టెస్టుల మీద ఐసీఎంఆర్ కొత్త గైడ్‌‌లైన్స్‌‌ను విడుదల చేసింది. 
 
ఆర్‌టీపీసీఆర్ టెస్టులు ఎప్పుడు చేయాలంటే.. 
దేశీయంగా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలనుకునే వారు ఆర్‌టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవచ్చు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినప్పుడు ఆర్‌టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి వుంటుంది. 
 
హోమ్ ఐసోలేషన్‌లో 10 రోజులు ఉండి.. మూడ్రోజులుగా జ్వరం లక్షణాలు లేనివారు ఆర్‌‌టీ‌పీసీఆర్ టెస్టు చేయించుకోవచ్చు. 
 
ర్యాపిడ్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చి.. కరోనా లక్షణాలు ఉంటే ఆర్‌టీపీసీఆర్ చేయించుకోవచ్చు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఆర్‌టీపీసీఆర్ టెస్టు చేయించుకోవచ్చు.

అన్నీ చూడండి

ప్రదీప్, మమిత లవ్వులో వున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారట!

Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

Chiru158: హైదరాబాద్‌లో శమెగాస్టార్ చిరంజీవి 158 చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్

మిస్టరీ, సస్పెన్స్ తో వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ టీజర్

Ntr: ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో విబేదం ఏమిటి ?

తర్వాతి కథనం
Show comments