తెలుగు రాష్ట్రాల్లో డబుల్ మ్యూటెంట్ వేరియంట్ B.1.617 దాడి!
దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పేషెంట్స్ తో హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. చాలామందికి ఆక్సిజన్‌తో కూడిన పడకలు లభించక హాస్పిటల్ ఆవరణలోనే తుది శ్వాస విడుస్తున్నారు.
హాస్పిటల్స్‌లో వాతావరణంను ఎవరూ వర్ణించలేరు. ఇక మృతిచెందినవారి దహన సంస్కారాలకు స్మశానవాటికలో చోటు దొరకడం లేదు. రోజుకు ఇద్దరు లేదా ముగ్గురిని ఖననం చేసే కాటికాపరులు... ఇప్పుడు రోజుకు 15 నుంచి 20 మందికి దహన సంస్కారాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ మేరకు పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలో వైరస్‌కు చెందిన డబుల్ మ్యూటెంట్ వేరియంట్ B.1.617 దాడి చేస్తోందని సెంటర్ ఫర్ సెల్యూలర్ మరియు మోలెక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇది N440K వేరియంట్‌ను రీప్లేస్ చేసిందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. 5వేల వేరియంట్లను సేకరించి వారిని విశ్లేషించనట్లు చెప్పిన శాస్త్రవేత్తలు... N440K వేరియంట్ దక్షిణాది రాష్ట్రాల్లో విపరీతంగా వ్యాప్తి చెందిందని చెప్పారు.
అయితే ఈ మధ్యకాలంలో డబుల్ మ్యూటెంట్ వేరియంట్ B.1.617 వేరియంట్ N440Kని రీప్లేస్ చేస్తూ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించారు. ఇది కేరళను కూడా తాకినట్లు సీసీఎంబీలో పనిచేసే మరో శాస్త్రవేత్త దివ్య తేజ్ సోపతి చెప్పారు.