గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మే 2021 (11:50 IST)

కరోనాకు విజయనగరం డిప్యూటీ మేయర్ మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి బుధవారం ఉదయం కన్నుమూశారు. ఏప్రిల్ నెలలో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు... కొన్ని రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్ సోకడంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఆమె మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులతో పాటు.. శ్రేయోభిలాషులు, హితులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అలాగే, స్థానిక వైకాపా నేతలు కూడా ఆమె మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈమె మృతి పార్టీకి తీరని లోటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.