మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (10:56 IST)

వారు చేసిన పనికి సోనూ సూద్ ఫిదా.. ఏపీ గ్రామానికి రానున్న రియల్ హీరో

ఆ గ్రామ ప్రజలు చేసిన పనికి రియల్ హీరో సోనూ సూద్ ఫిదా అయిపోయారు. దీంతో ఆ గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో కలిసి ముచ్చటించాలని నిర్ణయించుకున్నారు. ఇదే అంశాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. ఇంతకీ ఆ గ్రామస్తులు ఏం చేశారో ఓ సారి తెలుసుకుందాం. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఓ మారుమూలన కొడుమా అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చి 73 యేళ్లు పూర్తయినా ఇప్పటికీ సరైన రోడ్డు మార్గం లేదు. పాలకులను నమ్ముకుంటే మరో 70 యేళ్లు అయినా గ్రామానికి రోడ్డు రాదని వారంతా భావించారు. 
 
అంతే... గ్రామస్తులంతా కలిసి తమ గ్రామానికి అవసరమైన 4 కిలోమీటర్ల పొడవున ఘాట్ రోడ్డును నిర్మించుకున్నారు. ఇందుకు అవసరమయ్యే మొత్తాన్ని ఒక్కో ఇంటికి రూ.2 వేలు చొప్పున చందాలు వేసుకుని సమకూర్చుకున్నారు. ఈ నిధులతో ఘాట్ రోడ్డును నిర్మించుకున్నారు. ఈ విషయాన్ని కృష్ణమూర్తి అనే ట్విట్టరేటి తన ఖాతాలో షేర్ చేశారు. అంతే.. ఈ విషయం సోనూ సూద్ దృష్టికెళ్లింది. 
 
దీనికి రీట్వీట్ చేస్తూ... ఆ గ్రామస్తులు యావత్ దేశానికి ప్రేరణ. స్ఫూర్తి. త్వరలోనే మీ గ్రామానికి వస్తాను గయ్స్ అంటూ ఓ వీడియో సందేశాన్ని తన మనస్సులోని మాటను ట్వీట్ చేశారు.