శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (13:13 IST)

ఈ ఆనందం తొలి కారు కొన్న‌ప్పుడు కలగలేదు.. కలియుగ కర్ణుడు

మహాభారత కాలంలో కర్ణుడు చేసిన దానం గురించి ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. అయితే, ఇపుడు ఈ కలియుగ కర్ణుడు గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు.. వెండితెరపై ప్రతినాయకుడు, నిజ జీవితంలో రియల్ హీరో సోనూ సూద్. 
 
కరోనా కష్టకాలంలో ఆయన చేస్తున్న దానానికి ఆకాశమే హద్దుగా మారిపోయింది. కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనేవున్నారు. 
 
తాజాగా ఓ కుటుంబ ఆదాయ వ‌నరైన గెదె చ‌నిపోవ‌డంతో వారికి మ‌రో గేదెని కొనిచ్చి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. అయితే వారి కోసం కొత్త గెదెను కొన్న‌ప్పుడు క‌లిగిన ఆనందం, నా తొలి కారు కొన్న‌ప్పుడు క‌ల‌గ‌లేదంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకు బీహార్ వ‌చ్చిన‌ప్పుడు ఆ గెదె పాలు గ్లాస్ తాగుతానంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.
 
కరోనా వైరస్ కష్టకాలంలో బీహార్ చంపారన్‌లోని భోలా గ్రామానికి చెందిన ఒక కుటుంబం గతంలో సంభవించిన వరదల్లో తమ కుమారుడుతో పాటు.... కుటుంబ ఏకైన ఆదాయ వనరు అయిన గేదెను కోల్పోయింది. ఈ విష‌యం సోనూసూద్ దృష్టికి చేర‌డంతో వెంట‌నే కొత్త గెదెని వారికి అందేలా త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాడు. దీంతో ఆ కుటుంబం ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.