ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శనివారం, 4 ఏప్రియల్ 2020 (22:58 IST)

శ్రీనివాస ఆర్ ఎంపీ ఆసుపత్రి సీజ్, షాద్ నగర్లో కరోనా కలకలం

కరోనాతో మృతి చెందిన నందిగామ మండలంలోని చేగుర్ గ్రామానికి చెందిన బారతమ్మకు తొలుత వైద్యం చేసింది షాద్ నగర్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ దంత వైద్య ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. 
 
ఇప్పటికే ఆర్ఎంపీలు, పిఎంపిలు దగ్గు జలుబు జ్వరం వచ్చిన వారికి వైద్యం చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.
 
వాటిని పట్టించుకోకుండా వైద్యం చేసిన నేపథ్యంలో మొన్న మృతి చెందిన భారతమ్మకు విఠల్ ఆసుపత్రిలో వైద్యం చేశారు. ఆ తరువాత ఆమె ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పటికే రక్త పరీక్షల కోసం బ్లడ్ శాంపిల్ తీసుకున్న ఆసుపత్రి వర్గాలు పరీక్షలు నిర్వహించడంతో నిన్న పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది.
 
దీంతో వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు పోలీసులు ఏపీడమిక్ యాక్ట్ ప్రకారం ఆసుపత్రిని సీజ్ చేశారు. మిగతా ఆర్ఎంపీలు ఎవరు ఆసుపత్రులు తెరిచినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.