Biodata Maker

సచిన్ భారీ విరాళం.. ఇటలీలో 8,165కి చేరిన కరోనా మృతుల సంఖ్య

Written By సెల్వి
Updated: శుక్రవారం, 27 మార్చి 2020 (16:05 IST)
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా మహమ్మారిపై పోరాటానికి తన వంతు విరాళం ప్రకటించాడు. దేశంలోని ప్రముఖులు సామాజిక బాధ్యతతో స్పందిస్తూ భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.

భారత్‌లో కరోనా కేసుల పెరుగుదల నిష్పత్తి ఆందోళనకరంగా ఏమీ లేకున్నా.. వైరస్ వ్యాప్తిని దృష్టిలో వుంచుకుని మున్ముందు కూడా కఠినంగా వ్యవహరించాలని కేంద్రం భావిస్తోంది. 
 
ఇదిలా ఉంటే కరోనా మృత్యుఘోషతో ఇటలీ అట్టుడికిపోతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి మృత్యు ఒడిలోకి చేరిపోతున్నారు. దీనిని అరికట్టేందుకు, ఆ మహమ్మారి బారి నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు ఇటలీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ తగిన ఫలితాలనివ్వడం లేదు.

గత 24 గంటల్లోనే 662 మంది కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని కన్నుమూశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరితో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 8,165కు చేరింది.

అన్నీ చూడండి

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

Tanikella Bharani: మినీ శంకరాభరణం తరహాగా పాటకు ప్రాణం చిత్రం ప్రారంభం

Sundeep Kishan: సందీప్ కిషన్ చిత్రం సిగ్మా రిలీజ్ కు రెండు అగ్ర సంస్థలు అండగా నిలిచాయ్

తర్వాతి కథనం
Show comments