Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కరోనా వస్తే ఇన్ని ఇబ్బందులా..? మెదడుకు దెబ్బ.. గాలి ద్వారా కోవిడ్ వ్యాప్తి.. జరజాగ్రత్త!!

Written By సెల్వి
Updated: శుక్రవారం, 10 జులై 2020 (15:34 IST)
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్న వేళ.. కరోనాతో పెను ప్రమాదం పొంచి వుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందని చెప్పిన శాస్త్రవేత్తలు.. మరో షాకిచ్చే విషయం తెలిపారు. కోవిడ్‌-19 రోగుల్లో పలు రకాల మెదడు, నాడీ సంబంధిత సమస్యలను గుర్తించామని లండన్‌ పరిశోధకులు తాజాగా వెల్లడించారు.
 
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. అంతేకాదు కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని, అంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. లివర్‌పూల్ విశ్వవిద్యాలయం సహా, ఇతర శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కరోనా రోగుల్లో గుండె జబ్బులు, మతిమరుపు ఇతర నాడీ సంబంధిత, మానసిక సమస్యలను కరోనాకు భారీగా ప్రభావితమైన దేశాలు నివేదించాయి. 
 
ది లాన్సెట్ న్యూరాలజీలో ప్రచురించిన ఈ అధ్యయనాల ప్రకారం స్ట్రోక్, మెదడు వాపు, వెన్నుపాము, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చునని పరిశోధకులు వెల్లడించారు. కరోనా సోకిన వారిలో దాదాపు వెయ్యి మంది రోగులు ఇలాంటి సమస్యలకు గురయ్యారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రధానంగా కరోనా వైరస్ సోకిన బాధితుల్లో మెదడులో ఇన్ఫెక్షన్‌ లేదా వాపు ముప్పు వున్నట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments