తెలంగాణ కరోనా అప్‌డేట్స్, కొత్తగా 1267 పాజిటివ్ కేసులు

Written By వి
Updated: మంగళవారం, 10 నవంబరు 2020 (11:08 IST)
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ వచ్చిన కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1267 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 4 మంది కరోనాతో తమ ప్రాణాలు కోల్పోయారు.
 
ఇదిలా ఉండగా కరోనా నుండి 1,831 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,52,455కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,32,489 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మృతుల సంఖ్య 1385కి చేరింది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 18,581 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. వారిలో 15,794మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 201 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 104 కేసులు నిర్ధారణ అయ్యాయి.

అన్నీ చూడండి

జన నాయగన్ చిత్రం నుంచి నా సన్నివేశాన్ని తీసేసారు: గద్గద స్వరంతో నటి ఆనంది

Vijayashanti :చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ వుంది :విజయశాంతి

Sakshi Madolkar : శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

Kalyanram: తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్నవెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం

Chennai Love Story review :గుండెల్ని పిండే ప్రేమకథగా కిరణ్ అబ్బవరం....చెన్నై లవ్ స్టోరీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments