Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌తో ఆగిన పెళ్లి.. తెలంగాణలో ఒకే రోజు 1,567 కేసులు

Written By సెల్వి
Updated: గురువారం, 23 జులై 2020 (22:16 IST)
కరోనా కారణంగా పెళ్లి ఆగిపోయింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో పెళ్లి ఆగిపోయింది. ఆనందంతో పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా కల్యాణ ఘడియలకు ఒక్క రోజు ముందు పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్‌ అని సంక్షిప్త సందేశం అందింది. దీంతో అతడిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించడంతో పెళ్లి ఆగిపోయింది. 
 
పెళ్లి కుమారుడికి జ్వరం రావడంతో అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఫలితం పాజిటివ్‌ రావడంతో పెళ్లి పనుల్లో పాలుపంచుకున్న వారంతా ఇప్పుడు భయాందోళనతో కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలంగాణలో కొత్తగా గురువారం 1,567 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,826కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
 
కొత్తగా కరోనాతో కోలుకున్న1,661 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 39,327కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

అన్నీ చూడండి

సందీప్ రెడ్డి వంగా సినిమా రోమాంచకం టైటిల్ సాంగ్ రిలీజ్

సత్యజిత్ రే, రాజమౌళి సినిమాలు ఇష్టపడతాను : దర్శకుడు ఉదయ్ చౌహాన్

jony master :దళారులు లేకుండా కళాకారులకు నేరుగా చెల్లింపులు : టీ.జి. విశ్వ ప్రసాద్

రూరల్ ఎంటర్‌టైనర్‌గా శివకార్తికేయన్ చిత్రం సెయాన్ రెండో షెడ్యూల్ షురూ

Haiwaan: అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్ ల హైవాన్ టీజర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments