టెక్నికల్ కొర్రీలతో షాకిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (15:10 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఆవిష్కరించిన టీకాల్లో కోవ్యాగ్జిన్ ఒకటి. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం గుర్తింపు కోసం ప్రస్తుతం టీకా తయారీదారు భారత్ బయోటెక్ సమర్పించిన డేటాను డబ్ల్యూహెచ్ఓ సమీక్షిస్తోంది. అయితే, దీనికి అనుమతి ఇచ్చే విషయంలో మరింత జాప్యం నెలకొనే అవకాశం ఉంది. 
 
తాజాగా, వ్యాక్సిన్‌కు సంబంధించి సాంకేతిక అంశాలపై డబ్ల్యూహెచ్ఓ మరిన్ని సందేహాలను వెలిబుచ్చి, భారత్ బయోటెక్‌ను వివరణ కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ జాప్యంతో భారతీయులు ముఖ్యంగా విద్యార్థులు, అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారిపై తీవ్ర ప్రభావం చూపనుంది.
 
భారత్ స‌హా కొన్ని దేశాల్లో ఇప్ప‌టికే కొవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగం కొన‌సాగుతున్నా… డ‌బ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన క‌రోనా వ్యాక్సిన్ల జాబితాలో మాత్రం లేదు. డబ్ల్యూహెచ్ఓ ఈయూఏ లేకుండా కొవాగ్జిన్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆమోదం లభించిన టీకాగా పరిగణించవు. టీకా ఆమోదం కోసం భారత్ బయోటెక్ అవసరమైన డేటాను సమర్పించినట్టు తెలిపినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ తాజాగా పలు సాంకేతిక అంశాలపై వివరణ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. 

అన్నీ చూడండి

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

Surya and Mamitha Baiju : ది వెడ్డింగ్ సాంగ్ లో ఆడి పాడిన సూర్య, మమితా బైజు

తర్వాతి కథనం
Show comments