బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (12:15 IST)

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

ఆసియా కప్‌‌ క్రికెట్ టోర్నీలో భాగంగా భారత్ మంగళవారం నాటి మ్యాచ్ పోరాడి గెలిచింది. హాంకాంగ్ జట్టు భారత్‌కు చుక్కలు చూపించింది. దుబాయ్‌లో బుధవారం రాత్రి ఆసియా కప్‌లో భాగంగా పసికూన హాంకాంగ్‌పై నానా తంటాల

ఆసియా కప్‌‌ క్రికెట్ టోర్నీలో భాగంగా భారత్ మంగళవారం నాటి మ్యాచ్ పోరాడి గెలిచింది. హాంకాంగ్ జట్టు భారత్‌కు చుక్కలు చూపించింది. దుబాయ్‌లో బుధవారం రాత్రి ఆసియా కప్‌లో భాగంగా పసికూన హాంకాంగ్‌పై నానా తంటాలు పడి భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ డక్కౌటైన సమయంలో ఓ బాలుడు కోపంతో ఊగిపోయిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ధోనీ అవుటైన తర్వాత ఓ బాలుడు చూపించిన ఆగ్రహం, అసహనం నవ్వు తెప్పిస్తోంది. శిఖర్ ధావన్ పెవీలియన్ దారిపట్టిన తరువాత బరిలోకి దిగిన ధోనీ, కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుట్ అయ్యారు. 
 
హాంకాంగ్ స్పిన్నర్ ఇషాన్ ఖాన్ బౌలింగ్‌లో ధోనీ నిష్క్రమించగా, ఆ బాలుడికి ఎంత ఆగ్రహం వచ్చిందంటే, కుర్చీలను కూడా తన్నాడు. అంతే అరుస్తూ తన కోపాన్ని వ్యక్తం చేశాడు. ధావన్ బాదుతున్నప్పుడెల్లా ఆనందంతో గంతులేస్తూ, కనిపించిన ఆ బాలుడు, ధోనీ అవుట్ అయిన తరువాత అంతే కోపానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.