ఆసియా కప్ టోర్నీ- షెడ్యూల్ ఇదే.. రికార్డుల కోసం రోహిత్ సేన రెఢీ
ఆసియా కప్ టోర్నీ కోసం టీమిండియా సన్నద్ధమైంది. 15 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు గురువారం సాయంత్రం యూఏఈకి బయల్దేరింది. అయితే ఈ టోర్నీ నుండి విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో హి
ఆసియా కప్ టోర్నీ కోసం టీమిండియా సన్నద్ధమైంది. 15 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు గురువారం సాయంత్రం యూఏఈకి బయల్దేరింది. అయితే ఈ టోర్నీ నుండి విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో హిట్ మ్యాన్ రోహిత్ టీంఇండియా పగ్గాలు చేపట్టాడు.
ఇప్పటికే విజయవంతమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్...ఇక విజయవంతమైన కెప్టెన్‌గా పేరుతెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆసియా కప్ 2018 కప్‌ను టీమిండియాకు అందించి కెప్టెన్‌గా నిరూపించుకోవాలని రోహిత్ ఉవ్విళ్ళూరుతున్నాడు.
ఇదివరకు 2017లో శ్రీలంక టూర్ సందర్భంగా రోహిత్ శర్మ తొలిసారి భారత జట్టు సారథ్య పగ్గాలు చేపట్టాడు. ఈ సిరీస్‌లో టీంఇండియా రోహిత్ కెప్టెన్సీలో అద్బుతమైన ఆటతీరుతో టీమిండియా వన్డే, ట్వంటీ-20 సిరీస్‌లను గెలుచుకుంది.
ఇక వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శనలో రోహిత్ భారత జట్టులో టాప్ బ్యాట్ మెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2007 లో భారత జట్టులో స్థానం సంపాదించిన రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 6,748 పరుగులు సాధించారు. ఇందులో 18 సెంచరీలు, 34 హాప్ సెంచరీలున్నాయి. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్ క్రికెట్ చరిత్రలో నిలిచాడు. ఈ ఆసియా కప్‌లో కూడా కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల మోత మోగించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఆసియా కప్ షెడ్యూల్ వివరాలు
సెప్టెంబర్ 15 శనివారం - గ్రూప్ బి - శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్
సెప్టెంబర్ 16 ఆదివారం - గ్రూప్ ఎ - హాంకాంగ్ వర్సెస్ పాకిస్థాన్
సెప్టెంబర్ 17 సోమవారం - గ్రూప్ బి - శ్రీలంక వర్సెస్ ఆప్ఘనిస్థాన్
సెప్టెంబర్ 18 మంగళవారం - గ్రూప్ ఎ - భారత్ వర్సెస్ హాంకాంగ్
సెప్టెంబర్ 19 బుధవారం - గ్రూప్ ఎ - భారత్ వర్సెస్ పాకిస్థాన్
సెప్టెంబర్ 20 గురువారం - గ్రూప్ బి - బంగ్లాదేశ్ వర్సెస్ ఆప్ఘనిస్థాన్
సెప్టెంబర్ 21 - సూపర్ 4 మ్యాచ్ 1, 2
సెప్టెంబర్ 23 - సూపర్ 4 మ్యాచ్ 3, 4
సెప్టెంబర్ 25 - సూపర్ 4 మ్యాచ్ 5
సెప్టెంబర్ 26 - సూపర్ 4 మ్యాచ్ 6
సెప్టెంబర్ 28 - ఫైనల్