గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (13:22 IST)

సూసైడ్ చేసుకున్న క్రికెటర్.. ఎవరా క్రికెటర్.. ఎందుకు?

రంజీ మాజీ క్రికెటర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

రంజీ మాజీ క్రికెటర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అమోల్ జిచ్‌కర్ అనే రంజీ మ్యాచ్‌ మాజీ క్రికెటర్ రంజీ మ్యాచ్‌లలో ఆడుతూ రాణిస్తున్నాడు. రంజీల్లో విదర్భ జట్టుకు అమోల్ ప్రాతినిధ్యం వహించాడు. నాగపూర్‌లో భార్య, కుమారుడితో కలసి ఆయన నివసిస్తున్నాడు. 
 
అయితే, ఇటీవలి కాలంలో ఆయన ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు. దీంతో నాగపూర్‌లోని అతని నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది సోమవారం జరగ్గా మంగళవారం వెలుగులోకి వచ్చింది. 
 
ఇటీవలే మాజీ క్రికెటర్ విపుల్ పాండేతో కలసి అమోల్ రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ వ్యాపారం కూడా నష్టాలనే మిగల్చడంతో... మనస్తాపానికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.