గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (09:16 IST)

హార్దిక్ పాండ్యాకు న్యూయర్ సందర్భంగా నిశ్చితార్థం జరిగిపోయింది.. ఫోటోలు వైరల్

హార్దిక్ పాండ్యా ఓ ఇంటి వాడు కానున్నాడు.  త్వరలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తారని సమాచారం. కొత్త సంవత్సరం సందర్భంగా హార్దిక్ పాండ్యా చేసిన ప్రకటనతో క్రికెట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గత కొంతకాలంగా సెర్బియా మోడల్‌ నటాషా స్టాన్‌తో రిలేషన్‌పిప్‌లో వున్న సంగతి తెలిసిందే.
 
వీరిద్దరి మధ్య సంబంధంపై తాజాగా హార్దిక్ పాండ్యా స్పందించాడు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాలో పాండ్యా ఒక పోస్టు పెట్టాడు. అందులో నటాషాతో తాను దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ నా ఫైర్‌వర్క్‌తో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం అని కామెంట్ పెట్టాడు. నటాషా గురించి హార్దిక్ పాండ్యా చేసిన మొదటి కామెంట్ ఇది కావడం విశేషం. నిజానికి గత కొంతకాలంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని వార్తలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
 
హార్దిక్ పాండ్యాకి బాలీవుడ్ నటి నటాషా స్టాన్‌కోవిచ్‌‌తో నిశ్చితార్థం జరిగిపోయిందని టాక్ వస్తోంది. కొత్త సంవత్సరం, బుధవారం ఉదయం తమ ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేసిన హార్దిక్ పాండ్యా.. సాయంత్రం నిశ్చితార్థం అయిపోయినట్లు ఫొటోల్ని షేర్ చేశాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది.