1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 మే 2024 (22:39 IST)

SRHను ప్లేఆఫ్స్‌కు చేర్చిన Hyderabad rain

SRH to the playoffs
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును హైదరాబాద్ వర్షం ప్లేఆఫ్స్ అర్హతను తెచ్చిపెట్టేసింది. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కి వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. దీనితో ఇరు జట్లకు చెరో పాయింటును కేటాయించారు. దీనితో SRH జట్టుకు 15 పాయింట్లు రావడంతో అది ప్లేఆఫ్స్ కి దూసుకెళ్లింది.

మధ్యాహ్నం నుంచే వాన దంచికొట్టినా సాయంత్రం కాస్త తెరిపిచ్చింది. రాత్రి 8 గంటలకు టాస్ వేసి ఆటను ప్రారంభించాలనుకున్నారు కానీ ఇంతలోనే మళ్లీ వర్షం ప్రారంభమైంది. ఎంతసేపటికీ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.