గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (21:32 IST)

కేప్‌టౌన్ టెస్ట్ మ్యాచ్ : కోహ్లీ పోరాటం.. భారత్ 223 ఆలౌట్

ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో కేప్‌‍టౌన్ వేదికగా జరుగుతున్న కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరోచితంగా ఒంటరిపోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 79 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. 
 
అయితే, మరోమారు ఔట్ సైడ్ ఎడ్జ్‌తో రబాడ  బౌలింగ్‌లో వెవిలియన్‌కు చేరాడు. అలాగే, మిగిలిన భారత ఆటగాళ్లలో పుజార్ 43, రిషబ్ పంత్ 27 మినహా ఇతరులెవ్వరూ రాణించలేదు. ఫలితంగా భారత్ 223 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 4 వికెట్లు తీయగా, మాక్రో జాన్సన్ మూడు వికెట్లు తీశారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమాత్రం ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఓపెనర్లు రాహుల్ 12, అగర్వాల్‌ 15 చొప్పున పరుగులు చేసి స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పుజారా, కోహ్లీ జోడీ కాసేపు క్రీజ్‌లో నిలబడి సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కొన్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది.