మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (14:42 IST)

ధోనీ మరాఠీ భాషలో మాట్లాడి.. కొంపముంచేశాడు.. (video)

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డే గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ వన్డేలో ధోనీ చేసిన రనౌట్ గురించి ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ధోనీ వల్లే ఐదో వన్డేలో తాము ఓడిపోయామని కివీస్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెప్పాడు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ చేతిలో కివీస్ జట్టు మూడు మ్యాచ్‌లను వరుసగా ఓడింది. 
 
చివరికి నాలుగో వన్డేలో నెగ్గినా.. ఐదో వన్డేలోనూ నామమాత్రంగా విజయాన్ని కైవసం చేసుకోవాలనుకున్నాం. ఈ క్రమంలోనే టీమిండియాలో కీలక వికెట్లు పడగొట్టాం. అయితే రాయుడు, విజయ్ శంకర్ అద్భుతంగా రాణించారు. దీంతో తమ అంచనాలు తలకిందులు అయ్యాయి. అయినా నమ్మకంతో 250 పరుగుల లక్ష్యాన్ని సొంత గడ్డపై చేధించడం సులభం అనుకున్నాం. 
 
కానీ ధోనీ మా ఆశలపై నీళ్ల చల్లాడు. పరుగుల చేధించే సమయంలో తమ జట్టు బ్యాట్స్‌మెన్లకు చుక్కెదురైంది. నాలుగు వికెట్లను ఎల్‌బీడబ్ల్యూలో కోల్పోయాం. అయినా జేమ్స్ నిశాంత్ బ్యాటింగ్‌తో కివీస్‌కు జట్టు ఖాయమనుకున్నాం. కానీ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతంగా రనౌట్ చేయడంతో డీలా పడిపోయాం. 
 
మంచి ఫామ్‌లో నిలకడగా ఆడుతున్న బ్యాట్స్‌మెన్‌ను ధోనీ రనౌట్ చేయడం ద్వారా విజయావకాశాలను తమ వద్ద నుంచి లాక్కున్నాడని కేన్ విలియమ్సన్ తెలిపాడు. ధోనీ ఇంత అద్భుతంగా రనౌట్ చేస్తాడని.. తద్వారా మమ్మల్ని దెబ్బతీస్తాడని కొంచెం కూడా ఆలోచించలేదు. ధోనీ ఇలా ముంచేస్తాడని.. ఇంత పనిచేస్తాడని తాము అనుకోలేదని కివీస్ కెప్టెన్ వాపోయాడు. బ్యాటింగ్‌లో రాణించలేకపోయినా.. వికెట్ కీపర్‌గా ధోనీ జట్టును గెలిపించాడని కేన్స్ విలియమ్స్ కొనియాడాడు. ఇంకా ధోనీ రనౌట్‌పై క్రికెట్ ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.  
 
ఇకపోతే.. జేమ్స్ నిశాంత్‌ను అవుట్ చేసే సమయంలో ధోనీ కేదర్ జాదవ్‌తో ఆయన సొంత భాష అయిన మరాఠీలో మాట్లాడి.. సూచనలు చేశాడట. జేమ్స్‌కు కేదర్ జాదవ్ విసిరిన ఓవర్‌లో జాదవ్‌తో హిందీ, ఇంగ్లీష్‌లో కాకుండా ఆతని మాతృభాష అయిన మరాఠీలోనే ధోనీ మాట్లాడి.. సలహాలు ఇచ్చాడు. ధోనీ తన సొంత భాషలో తనకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్సే తనను అద్భుతంగా బౌలింగ్ చేసేలా చేసిందని కేదర్ స్వయంగా చెప్పాడు. 
 
ఇలా జట్టు సభ్యుల మాతృభాషను తెలుసుకుని వారిని అద్భుతంగా రాణించేలా చేసే చర్య.. ఏ కెప్టెన్ వద్ద తాను చూడలేదని.. కేవలం ధోనీలోనే ఆ నైపుణ్యాన్ని చూశానని కేదర్ జాదవ్ తెలిపాడు.