శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 31 అక్టోబరు 2018 (13:14 IST)

ప్రమాదంలో భారత క్రికెట్ : సౌరవ్ గంగూలీ లేఖాస్త్రం

భారత క్రికెట్ ప్రమాదంలో ఉందని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు బోర్డు పెద్దలకు ఆయన ఓ లేఖాస్త్రాన్ని సంధించాడు. ముఖ్యంగా 'బీసీసీఐ సీఈఓ జోహ్రీపై ఆరోపణల్లో ఎంత నిజముందో నాకు తెలియదు. కానీ ఈ అంశంపై స్పందించడంలో బోర్డు ఎందుకు తాత్సారం చేస్తున్నదో అర్థం కావడం లేద'ని వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై గంగూలీ రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే, భారత క్రికెట్‌లో ప్రస్తుతం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. బీసీసీఐలో లైంగిక దాడుల ఆరోపణలు రావడం.. వాటిపై ఆలస్యంగా స్పందించడం గందరగోళానికి దారితీస్తున్నాయన్నారు. 
 
బీసీసీఐ వ్యవహారాలు చూస్తున్న సీవోఏలో కూడా భేదాభిప్రాయాలు పొడసూపుతున్నాయి. బోర్డులోని సన్నిహితులు కొందరు తాము ఎటువైపు మొగ్గాలో సూచించమని అడగడంతో ఏం చెప్పాలో నాకు తోచలేదు. ఎన్నోఏళ్లు భారత క్రికెట్‌కు సేవలందించిన నేను ప్రస్తుత పరిణామాలపై ఎంతో విచారిస్తున్నాను. క్రికెట్‌ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు అని గంగూలీ ఆ లేఖలో పేర్కొన్నారు.