సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (10:11 IST)

అనుష్క శర్మ వల్లే రాణించగలిగాను... ఎక్కువ క్రెడిట్ ఆమెకే: విరాట్ కోహ్లీ

దక్షిణాఫ్రికా గడ్డపై తాను రాణించేందుకు తన భార్య అనుష్క శర్మనే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ మొత్తం మూడు సెంచరీలు, ఒక అర్థ సెంచరీతో అదరగొట్టాడు. మొ

దక్షిణాఫ్రికా గడ్డపై తాను రాణించేందుకు తన భార్య అనుష్క శర్మనే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ మొత్తం మూడు సెంచరీలు, ఒక అర్థ సెంచరీతో అదరగొట్టాడు. మొత్తం 558 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను అందుకున్న కోహ్లీ.. శనివారం ముగిసిన మ్యాచ్‌కు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన సతీమణి వల్లే ఈ స్థాయికి రాణించగలిగానని అనుష్క శర్మను ఆకాశానికెత్తేశాడు. 
 
ఈ విజయంలో ఎక్కువ క్రెడిట్ అనుష్కకే చెల్లుతుందని చెప్పారు. వ్యక్తిగత ప్రదర్శనతో కెప్టెన్‌గా విజయాలు అందుకోవడం గొప్ప అనుభూతి అని.. జట్టు విజయాల కోసం తన వంతుగా 120 శాతం కృషి చేస్తానని కోహ్లీ చెప్పారు. ఇప్పటికే సిరీస్ అయిపోలేదని ట్వంటీ-20 సిరీస్‌ను కూడా వదులుకునే ప్రసక్తే లేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
 
ఇకపోతే.. దక్షిణాఫ్రికాతో మూడు ట్వంటీ-20ల సిరీస్ ఆదివారం జోహెన్స్‌బర్గ్ వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక శనివారం నాటి ఆరో వన్డేలో 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ, ఈ సిరీస్‌లో మూడో సెంచరీ చేసి జట్టుకు భారీ విజయం  అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను సైతం కోహ్లీ సొంతం చేసుకున్నాడు.