బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (12:17 IST)

కోహ్లీ ప్రోత్సాహం వల్లే ధోనీ రాణిస్తున్నాడు : గంగూలీ కామెంట్స్

వారిద్దరిలో ఒకరు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కాగా, మరొకరు మాజీ కెప్టెన్. కానీ, వారిద్దరు టీమిండియాలో సభ్యులు. అయితే, ధోనీ ఇచ్చిన ప్రోత్సాహమే తనను ఇంతటి వాడిని చేసిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ పదేపదే చ

వారిద్దరిలో ఒకరు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కాగా, మరొకరు మాజీ కెప్టెన్. కానీ, వారిద్దరు టీమిండియాలో సభ్యులు. అయితే, ధోనీ ఇచ్చిన ప్రోత్సాహమే తనను ఇంతటి వాడిని చేసిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ పదేపదే చెపుతుంటాడు. 
 
కానీ, భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం మరోలా చెపుతున్నాడు. గత సంవత్సర కాలంగా ధోనీ చక్కగా రాణిస్తుండటాన్ని ప్రస్తావించిన ఈ మాజీ కెప్టెన్, కోహ్లీ కారణంగానే ధోనీ మెరుగ్గా ఆడుతున్నాడంటూ అభిప్రాయపడ్డారు. 
 
ప్రస్తుతం ధోనీ 9 వేలకు పైగా పరుగులు చేశాడని గుర్తు చేసిన ఆయన, తన కెరీర్ ముగిసేలోపు మరిన్ని పరుగులు చేస్తాడని, అందుకు కోహ్లీ అతనిపై ఉంచిన నమ్మకమే కారణమన్నాడు. 
 
ధోనీపై పూర్తి భరోసాను ఉంచిన కోహ్లీ, అతన్ని స్వేచ్ఛగా ఆడనిస్తున్నాడని అన్నారు. కెప్టెన్‌గా బాధ్యతలు పోషిస్తున్న కోహ్లీ, తన సహచరుడు, మార్గదర్శి అయిన ధోనీపై ఎంతో నమ్మకాన్ని చూపిస్తున్నాడని, అందుకు కోహ్లీకి కూడా కొంత క్రెడిట్ ఇవ్వాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు.