అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ 2 తాండవం. అఖండ లో దేవాలయాల ఔచిత్యాన్ని వివరించారు. ఇక సీక్వెల్ లో శివతత్త్వం చెబుతున్న బోయపాటి శ్రీను చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారణాసి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అఘోరాలుగా కొంతమంది ఇందులో నటిస్తున్నారు. అఖండలో మెయిన్ విలన్ ఇందులో నెగెటివ్ పాత్ర పోషిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు, అఘోరాలతో యాక్షన్ ఎపిసోడ్ ను ఇటీవలే చిత్రీకరించినట్లు తెలిసింది. శివుడి గెటప్ లో బాలక్రిష్ణ వారిపై పోరాడే సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని చిత్ర యూనిట్ చెబుతోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ దీనిపై ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం అఖండ 2 షూటింగ్ ని మేకర్స్ పక్కా ప్లానింగ్ గా కంప్లెట్ చేస్తున్నారట. పార్ట్ 1 లో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించినట్లు ఇందులోనూ రెండు పాత్రలు పోషించనున్నారు. ముందుగా అఘోరా గెటప్ పాత్రపై దర్శకుడు కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏకదాటిగా సాగుతున్న షూటింగ్ ను జూన్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అఖండ 2 సెప్టెంబర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 4 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. బాలయ్య సినిమా కోసం ఇప్పటికే థమన్ సంగీతపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.