సంబంధిత వార్తలు
- పంట పొలాల్లో భానుమతి రెడ్డి చిత్ర పోస్టర్ను ఆవిష్కరించిన రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్
- గుమ్మడి కాయ కొట్టేసిన 'వకీల్ సాబ్' - సంక్రాంతికి టీజర్
- లక్ష్ హీరోగా "గ్యాంగ్స్టర్ గంగరాజు" టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- జెర్సీని డిజైన్ చేసి శభాష్ అనిపించుకున్న 12 ఏళ్ల చిన్నారి
- ధోనిని మించిన మెంటార్ లేడు: కేఎల్ రాహుల్
మేడం టూసాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాదించారు. ఇప్పటికే ఢిల్లీ, లండన్ మ్యూజియాల్లో ఆయన మైనపు విగ్రహం కొలువుదీరివుంది. ఇపుడు తాజాగా దుబాయ్ మ్యూజియంలోనూ కొలువుదీరింది. దుబాయ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మేడం టుసాడ్స్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
ప్రస్తుతం ఐసీసీ నిర్వహించే ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ దుబాయ్ వేదికగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. టీమిండియా వన్డే జెర్సీ ధరించిన కోహ్లీ బౌలింగును ఎదుర్కొనేందుకు బ్యాట్ ఎత్తి సిద్ధంగా ఉన్నట్టుగా విగ్రహాన్ని రూపొందించారు.
కోహ్లీతోపాటు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ స్టార్లు రొనాల్డో, మెస్సి, ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ తదితరుల విగ్రహాలను కూడా ఈ మ్యూజియంలో ఇది వరకే ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.
