శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2017 (12:55 IST)

వివాదానికి దారితీసిన అక్తర్‌పై యువరాజ్ ట్వీట్.. ఇంతకీ ఏమైందంటే?

పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్- టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్‌ల మధ్య నెలకొన్న ఓ సరాదా ట్వీట్ వివాదానికి దారితీసింది. యువతలో ప్రేరణ నింపే కోట్స్‌తో అక్తర్ చేసిన ట్

పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్- టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్‌ల మధ్య నెలకొన్న ఓ సరాదా ట్వీట్ వివాదానికి దారితీసింది. యువతలో ప్రేరణ నింపే కోట్స్‌తో అక్తర్ చేసిన ట్వీట్‌పై యువరాజ్ స్పందించాడు. మీ కలలను నిజం చేసుకోవాలంటే కష్టపడటం ఒక్కటే మార్గమని షోయబ్ ట్వీట్ చేశాడు.
 
ఈ నేపథ్యంలో యువతకు ప్రేరణ నిచ్చే టిప్స్ బాగున్నాయి కానీ, చేతిలో హెల్మెట్ పెట్టుకుని.. వెల్డింగ్ చేసేందుకు వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావ్? అంటూ రీ ట్వీట్ చేశాడు. అక్తర్ వేషధారణ అలా ఉండడంతో యూవీ ఇలా సరదాగా స్పందించాడు. యూవీ ట్వీట్ చేసిన కాసేపటికే ఇది వైరల్ అయింది.
 
అయితే యువీ ట్వీట్‌పై పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. షోయబ్ మంచి మాటలు చెబితే యువరాజ్ వెటకారం చేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువరాజ్ సింగ్ అభిమానులు మాత్రం పాక్ అభిమానులది అర్థం లేని ఆవేశమని, వారిద్దరూ మంచి స్నేహితులని చెప్తున్నారు. యువీ సరదాగా ఇచ్చిన రిప్లైపై రాద్ధాంతం చేయడం తగదని సెలవిస్తున్నారు.