శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:27 IST)

డాక్టర్ యువరాజ్ సింగ్...

క్రికెటర్ యువరాజ్ సింగ్ డాక్టరయ్యాడు. అయితే, ఆయన నిజంగా వైద్యం చేసే డాక్టర్ మాత్రం కాదు. గ్వాలియర్‌కు చెందిన ఐటీఎం యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. దీంతో యువరాజ్ సింగ్ ఇపుడు డాక్టర్ యువర

క్రికెటర్ యువరాజ్ సింగ్ డాక్టరయ్యాడు. అయితే, ఆయన నిజంగా వైద్యం చేసే డాక్టర్ మాత్రం కాదు. గ్వాలియర్‌కు చెందిన ఐటీఎం యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. దీంతో యువరాజ్ సింగ్ ఇపుడు డాక్టర్ యువరాజ్ సింగ్ అయ్యాడు.
 
యువరాజ్ సింగ్ భారీ సిక్సర్లు, విధ్వంసకర బ్యాటింగ్. క్యాన్సర్ కారణంగా మధ్యలో ఆటకు దూరమైన ఈ ఫ్లామ్‌బోయంట్ బ్యాట్స్‌మన్.. ఆ తర్వాత దాని నుంచి పూర్తిగా కోలుకున్నా భారత జట్టులో మాత్రం స్థానం సంపాదించలేకపోయాడు. యువరాజ్ జట్టులో లేకపోయినా అతనంటే పడిచచ్చే క్రికెట్ అభిమానులు తక్కువేమీ కాదు.
 
అసాధారణ క్రీడా నైపుణ్యంతో పాటు వినమ్రత, మానవత్వంతో అనేక మందికి స్ఫూర్తిగా నిలిచిన యువరాజ్‌కు డాక్టరేట్ డిగ్రీని అందించడం ఆనందంగా ఉందని ఐటీఎం యూనివర్సిటీ ప్రకటించింది. యువరాజ్ సింగ్‌తో పాటు మరికొందరికీ ఈ వర్శిటీ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేసింది.