ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2016 (13:34 IST)

జాతి వివక్షకు గురైన యువరాజ్ సింగ్ కాబోయే భార్య.. ఇలాంటి మనుషులుంటారా?: హజల్ కీచ్

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను పెళ్లాడనున్న బ్రిటీష్ న‌టి హ‌జ‌ల్ కీచ్ జాతి వివక్షకు గురైంది. దీంతో యువీకి కాబోయే భార్యకు కోపమొచ్చింది. జాతి వివక్ష చూపారని కీచ్ ఆరోపిస్తూ వెస్ట్రన్ యూనియన్ మనీ ట్

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను పెళ్లాడనున్న బ్రిటీష్ న‌టి హ‌జ‌ల్ కీచ్ జాతి వివక్షకు గురైంది. దీంతో యువీకి కాబోయే భార్యకు కోపమొచ్చింది. జాతి వివక్ష చూపారని కీచ్ ఆరోపిస్తూ వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ ఫర్ కంపెనీ ఉద్యోగిపై విరుచుకుపడింది. పియూష్ శర్మ అనే ఉద్యోగి తన పట్ల జాతివివక్ష చూపించాడని హజల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
 
తన పేరు హిందూ మతానికి సంబంధించినది కాకపోవడంతో తనకు డబ్బిచ్చేందుకు అతడు నిరాకరించినట్లు తెలిపింది. తాను కలిసిన వారిలో జైపూర్‌లోని వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థలో పనిచేస్తున్న పియూష్ శర్మ అత్యంత జాతివివక్ష కలిగిన వ్యక్తి అని కీచ్ వెల్లడించింది. ఇలాంటి మనుషులు ఉంటారా అని తెలిసి చాలా బాధేసిందని.. హిందువైన తన తల్లి, ముస్లిం ఫ్రెండ్ ఎదురుగా తనకు ఈ అవమానం జరిగందని హజల్ కీచ్ వెల్లడించింది. 
 
తాను హిందువుగా పుట్టి పెరిగా.. అది సమస్య కాదు. పేరు చూసి వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థ వివక్ష చూపిస్తుందా అంటూ ప్రశ్నించారు. యువరాజ్ సింగ్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు. పియూష్ శర్మ ప్రవర్తన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నాడు. మనుషులుగా మనమంతా జాతివివక్షను సహించకూడదని వ్యాఖ్యానించాడు. శర్మపై వెస్ట్రన్ యూనియన్ మనీ కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు.