1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 నవంబరు 2014 (13:13 IST)

ఫిల్ హ్యూస్‌ మరణం దైవ నిర్ణయం.. బౌలర్ తప్పు లేదు : మైఖేల్ క్లార్క్!

ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం దైవ నిర్ణయమేగానీ, బౌలర్ తప్పిదం లేదని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా, ఆసీస్ బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్ బంతి తలకు తగలడంతో హ్యూస్ కోమాలోకి వెళ్లి మూడు రోజుల చికిత్స అనంతరం మరణించిన విషయం తెల్సిందే. 
 
ఈ విషయంలో బౌలర్ అబాట్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వెనుకేసుకొచ్చాడు. హ్యూస్ మరణం దైవ నిర్ణయమే తప్ప ఎవరూ కారణం కాదన్నారు. అబాట్ మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడని, గతాన్ని మరచి ఆటపై దృష్టిని పెట్టాలని పిలుపిచ్చాడు. అబాట్‌ను ఎవరూ తప్పు పట్టడం లేదని, అలా చేయాల్సి వస్తే మొత్తం క్రికెట్ కుటుంబాన్నే తప్పు పట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.